సింగరేణి సమ్మె ప్రారంభం

హైదరాబాద్‌: తమ డిమాండ్ల సాధన కోసం సింగరేణి బొగ్గుగని కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఉదయం ప్రారంభమైంది. సమ్మె కారణంగా చాలా బొగ్గు గనుల్లో పనులు స్తంభించిపోయాయి. మూడు రోజులుగా యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలువిఫలం కావడంతో కార్మికులు సమ్మెకు దిగారు.

సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యాజమాన్యం కార్మికులను కోరింది. మొత్తం 40 డిమాండ్లను కార్మికులు యాజమాన్యం ముందుపెట్టారు. యాజమాన్యం ఆదివారంనాడు 11 డిమాండ్లవిషయంలో చర్చల్లో సరిగా వ్యవహరించలేదని కార్మిక సంఘాల నేతలువిమర్శిస్తున్నారు. డిమాండ్లను సరిగా రాయలేదని, కరెంట్‌ సమస్యను పరిష్కరించడం లేదని వారన్నారు. చర్చల నిబంధలనుఅంగీకరించి ఆకస్మాత్తుగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగడంసరైంది కాదని సింగరేణి యాజమాన్యం అంటోంది. తమ డిమాండ్ల పరిష్కారంవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కార్మికులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లేఖలురాశారు. కార్మికుల సమ్మె వల్ల 69 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచే పోయే పరిస్థితిఏర్పడింది.కార్మికులకు సిఎం వినతి
కరవు, విద్యుత్‌ సంక్షోభంతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నతరుణంలో సమ్మెనువిరమించుకోవాలని కోరుతూ సింగరేణి కార్మికులకు చంద్రబాబు నాయుడు లేఖరాశారు. ఈ లేఖలను కంపెనీ యాజమాన్యం కార్మికులకుఅందజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+