విశాఖపట్నం: కాంగ్రెస్ నాయకురాలు, మాజీ శాసనసభ్యురాలు ఈటివిజయలక్ష్మి సోమవారం సాయంత్రం మరణించారు. ఆమె వయసు 51 ఏళ్లు. ఆమెకు భర్త, కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నవిజయలక్ష్మి నాలుగు రోజులుగా నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె 1987లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోవిశాఖ ఒకటవ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. 1994లో పరవడా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1999లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.