ఇరాన్ ఊచకోత.. అమెరికా స్థావరాలు క్లోజ్!

ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా క్షీణించడంతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజా ఉద్రిక్తతలకు అమెరికా సైన్యానికి చెందిన ఓ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడం ప్రధాన కారణమైంది. అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన తర్వాత అమెరికా దళాలు తెల్లవారుజామున ఇరాన్‌పై భారీ దాడులకు తెగబడ్డాయి. అమెరికా సైన్యం ఏకకాలంలో ఇరాన్‌కు చెందిన కీలక ప్రాంతాలైన కేశమ్ ఐలాండ్, సిరిక్, బందర్ అబ్బాస్, కోహ్-ఎ-ముబారక్, జాస్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ డిఫెన్స్, రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేయడమే కాకుండా.. అలాగేప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి సమీపంలోని సైనిక స్థావరాలపై అమెరికా విరుచుకుపడింది.

అమెరికా చేసిన ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) రంగంలోకి దిగింది. ఐఆర్జీసీ మొదట బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ ప్రధాన స్థావరాన్ని వందలాది డ్రోన్లతో ముట్టడించి అమెరికా రక్షణ వ్యవస్థలకు సవాల్ విసింది. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన జోర్డాన్‌పై కూడా విరుచుకుపడింది. జోర్డాన్‌లోని ప్రముఖ 'మువఫ్ఫాక్ సాల్టీ ఎయిర్‌బేస్' (దీనినే అల్-అజ్రాక్ ఎయిర్‌బేస్ అని కూడా పిలుస్తారు) లక్ష్యంగా ఇరాన్ భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

Iran US War 2026 IRGC Launches Ballistic Missiles on Jordan and Bahrain Airbases

ఈ క్షిపణి దాడుల అనంతరం ఇరాన్ సైనిక విభాగం ఐఆర్జీసీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, తాము జోర్డాన్ ఎయిర్‌బేస్‌లో నాలుగు ప్రధాన లక్ష్యాలను విజయవంతంగా దెబ్బతీశామని ప్రకటించింది. ఈ ఎయిర్‌బేస్‌ను అమెరికా తన అధునాతన యుద్ధ విమానాలైన F-35, F-15లను ఉంచడానికి ఉపయోగిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఈ ఫైటర్ జెట్స్ ఉండే హ్యాంగర్లు, అమెరికా కమాండ్ సెంటర్లు, సైనికులు నివసించే క్వార్టర్స్, అలాగే రాడార్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అయితే ఈ భీకర దాడుల కారణంగా అమెరికా దళాలకు లేదా జోర్డాన్ సైన్యానికి ఎంతవరకు ప్రాణనష్టం వాటిల్లిందనే ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

మధ్యప్రాచ్యంలో అమెరికాకు జోర్డాన్ అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉంది. గతంలో కూడా ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికా ఈ ఎయిర్‌బేస్‌ను ఉపయోగించుకుందని ఇరాన్ ఆరోపిస్తూ వచ్చింది. ఈ కారణంతోనే ఐఆర్జీసీ ఇప్పుడు నేరుగా జోర్డాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో జోర్డాన్‌ వ్యాప్తంగా ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బహ్రెయిన్, జోర్డాన్‌లపై జరిగిన ఈ దాడులతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గతంలో జరిగిన 40 రోజుల యుద్ధంలోనూ ఇరాన్ ఈ దేశాలను లక్ష్యంగా చేసుకోగా, తాజా పరిణామాలపై జోర్డాన్ ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+