రాంనాయక్ పై విపక్షం ఉడుంపట్టు
న్యూఢిల్లీఃపెట్రోలియం శాఖమంత్రి రాం నాయక్ రాజీనామా చేసే వరకు పార్లమెంటు కార్యక్రమాలు సాగనివ్వం అనివిపక్షాలు ఉటుంపట్టు పట్టాయి. ఈ అంశంపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయసభలు స్తంభించాయి.పెట్రోలు బంకులు కేటాయింపులను ప్రధాని రద్దు చేయడం అవకతవకలు జరిగాయనడానేందుకు నిదర్శనం అని,అందుకు బాధ్యత వహించి రాం నాయక్ రాజీనామా చేయాలని
గతంలో జరిగిన కేటాయింపుల్లో అవకతవకలు ఏమైనా వున్నాయా అనేవిషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాం నాయక్ మంగళవారం తెలిపారు. అయితే కోట్లు ఖర్చుపెట్టి సంపాదించుకున్న డీలర్ షిప్ లను ఒక్క కలంపోటుతో రద్దు చేయడం అన్యాయం అని డీలర్లు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా వున్న డీలర్లు కేంద్రంపై రణభేరి మోగించేందుకు సమాయత్తం అవుతున్నారు.












Click it and Unblock the Notifications