కోట్లు కొల్లగొడుతున్న చిన్న సినిమా..!
ప్రస్తుతం జనరేషన్ లో కంటెంట్ ఉన్న చిత్రాలకు భారీ ఆదరణ లభిస్తోంది. కథాబలం సరిగ్గా ఉంటే చాలు చిన్న సినిమానా..? లేక పెద్ద సినిమానా..? అని చూడటం లేదు. గతేడాది లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సైతం కపుల్ ఫ్రెండ్లీ లాంటి చిన్న సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. అయితే తాజాగా విడుదల అయిన కోలీవుడ్ స్టార్ హీరో అర్జున్ సర్జా 'బ్లాస్ట్' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్టు టాక్ తో దూసుకెళ్తోంది. మే 28 న రిలీజైన ఈ చిత్రానికి కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు ఈ 'బ్లాస్ట్' మూవీ బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బుక్ మై షో యాప్ ద్వారా ఈ చిత్రానికి దాదాపుగా 1 మిలియన్ కు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం. గ్రాస్ వసూళ్లు సైతం దాదాపుగా రూ. 60 కోట్ల రూపాయిల వరకు వచ్చింది. ఇటు తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రం సైలెంట్ గా పికప్ అయి సూపర్ హిట్ దిశగా వెళ్తోంది. ఇక మలయాళం, తమిళ్ లో ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. ఈ చిత్రంలో అర్జున్ సరసన అభిరామి, ప్రీతీ ముకుందన్ హీరోయిన్స్ గా నటించారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి సుభాష్ కే రాజ్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా కావడం విశేషం.

'బ్లాస్ట్' మూవీకి కేజీఎఫ్, సలార్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం అందించారు. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 15 కోట్లతో నిర్మించింది. ఇక చాలాకాలం తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ కు సరిపోయే పర్ ఫెక్ట్ యాక్షన్ కంటెంట్ పడటంతో ఈ చిత్రానికి మాస్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఫుల్ రన్ లో 'బ్లాస్ట్' మూవీ ఏ మేరకు రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications