తిరుమల అన్న ప్రసాదంలో కొత్తగా మరో పదార్ధం, భక్తులు కోరుకున్నట్లుగా..!!

తిరుమలలో అన్నప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదా లు అందించడమే లక్ష్యమని టీటీడీ చెబుతోంది. ఇదే సమయంలో భక్తుల నుంచి అన్న ప్రసాదం పై ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. ఇదే సమయంలో భక్తుల నుంచి వస్తున్న సూచనల మేరకు మెనూ లో మార్పులు చేస్తున్న టీటీడీ.. మరో కొత్త పదార్ధం అందించాలని నిర్ణయించింది.

తిరుమలలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులకు అన్నదానం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే మాసం వరకు 4.4 కోట్ల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు టీటీడీ తెలిపింది. 15.8 టన్నుల బియ్యంతో నిత్యం 3 లక్షల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు వివరించింది. ఈ ఏడాది జనవరి మాసంలో కోటి, ఫిబ్రవరిలో 71.39 లక్షలు, మార్చిలో 84.85 లక్షలు, ఏప్రిల్‌లో 85 లక్షలు, మే నెలల్లో 92 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు గణాంకాలతో సహా టీటీడీ పేర్కొంది.

 టీడీపీకి కేంద్రంలో కీలక పదవి, బీజేపీ ఆఫర్ - ఆయనకే ఛాన్స్..!?
టీడీపీకి కేంద్రంలో కీలక పదవి, బీజేపీ ఆఫర్ - ఆయనకే ఛాన్స్..!?
ttd-serves-record-4-4-crore-devotees-with-free-annaprasadam-between-january-and-may-here-the-detail

భక్తులక ోసం కొత్త నిర్ణయాలు

గత మూడు నెలలుగా నిత్యం 60 వేల మంది భక్తులకు అల్పాహారం,1.56 లక్షల మందికి భోజనం,70 వేల మంది భక్తులకు పాలు, టీ, కాఫీ పంపిణీ చేసినట్లు టీటీడీ చెప్పింది. మరో వైపు అన్నప్రసాదం ట్రస్టుకు అందిన విరాళాలు రూ.2,500 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. విరాళాలపై వచ్చే వడ్డీతో పాటు పలువురు భక్తులు ఉచితంగా ఇస్తున్న కూరగాయలతో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. కాగా, కొద్ది నెలల క్రితం టీటీడీ అన్న ప్రసాదంలో వడ చేర్చింది. ఇక.. ఇప్పుడు భక్తుల నుంచి వస్తున్న సూచనల మేరకు పప్పును వడ్డించే అంశం పరిశీలిస్తోంది. ప్రస్తుతం అన్నం తో పాటు వెజిటబుల్ కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, చట్ని, చక్కెర పొంగలితో పాటు వడను కూడా వడ్డించనున్నారు. ఇలా ఏడు రకాల రుచులను అన్నప్రసాదంగా అందిస్తున్న టీటీడీ ఇకపై పప్పును జోడించాలని భావిస్తోంది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+