బాలయ్య Vs రాజశేఖర్.. స్క్రీన్ తగలబడిపోవాల్సిందే!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే వార్త హాట్ టాపిక్‌గా మారింది. 'మాస్ గాడ్' నందమూరి బాలకృష్ణ - పవర్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ NBK112 గురించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో కొన్ని షాకింగ్ అప్‌డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమా టాలీవుడ్ రికార్డులను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. వెండితెరపై బాలయ్యను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ విధ్వంసాన్ని సృష్టించడం ఖాయం. పక్కా మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో, మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట.

Rajasekhar to play the villain in Balakrishna 112th film directed by Koratala Siva

పవర్‌ఫుల్ థీమ్.. ఇంట్రెస్టింగ్ టైటిల్!

కేవలం కమర్షియల్ హంగులే కాదు.. కొరటాల మార్క్ పవర్‌ఫుల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉండబోతోంది. "అధికారానికి ఉద్దేశం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది" అనే బలమైన థీమ్‌తో ఈ కథ నడవనుందని సమాచారం. ఇక ఈ సినిమాకు 'కార్పెంటర్' అనే వైవిధ్యమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టి ప్రచారం సాగుతోంది. కొరటాల శివ స్టైలిష్ స్క్రీన్ ప్లేకు బాలయ్య విధ్వంసం తోడైతే అదిరిపోతుందని అభిమానులు ఇప్పటినుంచే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్?

ఈ భారీ యాక్షన్ డ్రామాకు మరింత హైప్ ఇచ్చేందుకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య మార్క్ గర్జనకు, అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే ఫ్యాన్స్‌కు థియేటర్లలో పూనకాలే. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ క్రేజీ అప్‌డేట్స్‌పై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జూన్ నెలాఖరుకు లేదంటే జులైలో ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+