రూ.2 లక్షలు ఎక్కువిస్తా.. పడక గది ఆఫర్ ఇచ్చిన దర్శకుడికి నటి కౌంటర్!

ప్రముఖ టీవీ సీరియల్ 'జోధా అక్బర్'లో రుకైయా బేగంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లవీనా టాండన్ సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో బిజీగా ఉంటూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాను సినిమాలకు దూరం కావడం ప్రధాన కారణం 'కాస్టింగ్ కౌచ్' అని ఆమె తాజాగా వెల్లడించారు. తన కెరీర్లో రెండుసార్లు తనకు ఇటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. కానీ తను తన నైతిక విలువలకే కట్టుబడి ఆ ఆఫర్లను తిరస్కరించానని ఆమె స్పష్టం చేశారు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లవీనా మాట్లాడుతూ.. సినిమాల్లో ఆఫర్ల కోసం కొందరు మేకర్స్ తనను రెండుసార్లు కాంప్రమైజ్ కావాలని అడిగారని చెప్పారు. "ఒకసారి ఓ సౌత్ డైరెక్టర్ నన్ను సినిమా కోసం సంప్రదించారు. అది 10 నుంచి 15 రోజుల షూటింగ్ అని చెప్పారు. నేను సినిమా బడ్జెట్, నా రెమ్యునరేషన్ గురించి అడిగినప్పుడు.. సాధారణంగా అయితే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఒకవేళ నేను కాంప్రమైజ్ కావడానికి (డైరెక్టర్‌తో పడకగది పంచుకోవడానికి) సిద్ధంగా ఉంటే బడ్జెట్‌ను 7 లక్షల రూపాయలకు పెంచుతామని ఆఫర్ చేశారు" అని లవీనా సంచలన విషయాన్ని బయటపెట్టారు.

Casting Couch Jodha Akbar Fame Lavina Tandon Reveals South Director Compromise Offer Details

డైరెక్టర్ నోట ఆ మాట వినగానే లవీనా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయినప్పటికీ ఆమె ఎంతో సంయమనంతో ఆ డైరెక్టర్‌కు గట్టి సమాధానం ఇచ్చారు. "మీరు అడిగిన పద్ధతిలోని నిజాయితీని నేను గౌరవిస్తాను.. కానీ నేను ఇలాంటి పనులు చేయను. భవిష్యత్తులో మీ దగ్గర ఏదైనా మంచి, పద్ధతైన పాత్ర ఉంటేనే నాకు కాల్ చేయండి, లేదంటే అస్సలు కాల్ చేయకండి" అని ముఖం మీదే చెప్పేసినట్లు లవీనా టాండన్ వివరించారు. అంతేకాకుండా, ఇటీవల కాలంలో కూడా మరొకరు తనను ఇలాంటి డిమాండ్‌తోనే సంప్రదించారని, అప్పుడు కూడా తాను నిర్మొహమాటంగా నో చెప్పానని ఆమె వెల్లడించారు.

గ్లామర్ ఇండస్ట్రీలో ఉండే మహిళల పట్ల సమాజంలో ఉన్న తప్పుడు అంచనాలపై కూడా లవీనా టాండన్ ఆవేదన వ్యక్తం చేశారు. "గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి మేము దేనికైనా సిద్ధపడతామని చాలామంది అనుకుంటారు. మేము స్క్రీన్‌పై ఎక్కువమంది మగవారితో కలిసి పని చేస్తామని, రొమాంటిక్ సీన్స్ నటిస్తామని.. నిజ జీవితంలోనూ అలాగే ఉంటామని తప్పుగా భావిస్తారు. నిజానికి కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాలలోనూ ఉంటుంది, కానీ సినిమా ఇండస్ట్రీ విషయాలు త్వరగా బయటకు రావడం వల్ల ఇక్కడి వారెవరూ పద్ధతిగా ఉండరనే ముద్ర వేసేస్తారు" అని లవీనా టాండన్ కార్పొరేట్, గ్లామర్ ప్రపంచంలోని వాస్తవాలను ఎండగట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+