హైదరాబాద్‌ః ఏడాది కాలంగా సమ్మెలకు దూరంగా వున్న సింగరేణిలో మళ్లీ సమ్మె ప్రారంభమైంది. సోమవారం నుంచి ప్రధాన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె ప్రారంభించారు.
ఏడాది కాలంగా సమ్మెలు లేనందున నష్టాలను చాలా మటుకు పూడ్చుకోగలిగామని మరికొంత కాలం కార్మికులు ఇదే విధంగా సహకరిస్తే సంస్థ లాభాల్లో ప్రయాణిస్తుందని సింగరేణి యాజమాన్యంఅంటున్నది. అయితే కార్మికులు మాత్రం యాజమాన్యం లాభాల కోసం కార్మికులను మరయంత్రాలుగా మార్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనివిమర్శిస్తున్నారు. దాదాపు 97 శాతం మంది కార్మికులు సమ్మెకు సిద్ధంగా వున్న కారణంగా డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.