సోనియా, రాహుల్ తో విజయ్ భేటీ..! ఇండీ కూటమిలో చేరికకు ముహుర్తం..!

తమిళనాడులో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ (Vijay) ఇప్పుడు తమ బంధాన్ని మరింత విస్తరించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కూడా తమిళనాడు నుంచి తమకు లభించిన ఏకైక సీటును సైతం కాంగ్రెస్ పార్టీకి విజయ్ త్యాగం చేసేశారు. ఈ నేపథ్యంలో ఇక ఇండియా కూటమిలో టీవీకే చేరడం ఒక్కటే మిగిలున్న వేళ ఇవాళ కాంగ్రెస్ పెద్దల్ని ఆయన కలిశారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న విజయ్.. ఇవాళ టెన్ జన్ పథ్ కు వెళ్లి కాంగ్రెస్ దిగ్గజ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం గాంధీలతో తమిళనాడు ప్రభుత్వ పాలనతో పాటు జాతీయ స్దాయలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. వీటిలో ఇండియా కూటమి తాజా భేటీపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఇండియా కూటమి నిర్వహించిన భేటీకి డీఎంకే దూరంగా ఉండిపోవడం, అదే సమయంలో ఎంపీలు లేని టీవీకేకు కాంగ్రెస్ ఆహ్వానం పంపకపోవడం చర్చనీయాంశమైంది.

Vijay Eyes INDIA Bloc Entry After High-Stakes Meeting With Sonia Rahul Gandhi

ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ టీవీకే ఎంట్రీ విషయంలో సోనియా, రాహుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి తాజా భేటీలో ప్రతీ రెండు నెలలకోసారి కలవాలని నేతలు నిర్ణయించారు. దీని ప్రకారం ఆగస్టులో జరిగే భేటీలో టీవీకేను చేర్చుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీవీకే ఇండీ కూటమిలో చేరితే డీఎంకే అధికారికంగా గుడ్ బై చెప్పేసే ఆస్కారం ఉన్నందున ఏం చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+