హైదరాబాద్ లో మహిళలకు సూపర్ న్యూస్.. ఆ ఉద్యోగాలు మీ కోసమే.. హర్రీ అప్!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు మరియు చిన్నారి విద్యార్థులకు నాణ్యమైన పునాది విద్యను అందించేందుకు ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. విద్యా శాఖపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కారణంగా అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ తరగతులకు ప్రభుత్వ స్కూల్స్ లో ప్రారంభిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలో ప్రీ ప్రైమరీ తరగతులు.. నియామకాలు
ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రీ-ప్రైమరీ విభాగాన్ని బలోపేతం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచడంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు వీలుగా ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

మహిళా ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను నియమించనున్న సర్కార్
నగర పరిధిలో ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానమై ఉన్న ప్రీ-ప్రైమరీ క్లాసుల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. చిన్న పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, వారికి ఆటపాటలతో కూడిన విద్యను అందించేలా మహిళా ఇన్‌స్ట్రక్టర్లను ఎంపిక చేస్తారు. దీనితో పాటు క్లాసుల్లో ఉండే చిన్న పిల్లల సంరక్షణ కోసం, వారిని కంటికి రెప్పలా చూసుకునేందుకు వీలుగా ఆయాలను కూడా నియమించనున్నారు.
స్థానిక మహిళలకు ప్రాధాన్యత
ఈ నియామకాలను పూర్తిగా పారదర్శకంగా, స్థానిక అర్హతలకు ప్రాధాన్యత ఇస్తూ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానిక మహిళలకు ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు ఈ తరహా ప్రీ-ప్రైమరీ సదుపాయాలు మెరుగుపడటం వల్ల నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది.
త్వరలోనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సమయానికే ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసి, అభ్యర్థులను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు విధానం మరియు జీతభత్యాల వివరాలు త్వరలోనే సమగ్రంగా వెల్లడి కానున్నాయి. మరెందుకాలస్యం ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు అవసరం అయిన క్వాలిఫికేషన్స్ తో ఉద్యోగాలకు అప్లై చెయ్యండి.













Click it and Unblock the Notifications