పెద్దికి సాయం చేయబోయి ఇరుక్కున్న రేవంత్ సర్కార్..! హైకోర్టు షాక్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది ఈ మధ్యే విడుదలై విజయవంతంగా నడుస్తోంది. అయితే ఈ చిత్రం విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. గతంలో తాము పెట్టుకున్న నిబంధనలతో పాటు హైకోర్టు ఆంక్షల్ని కూడా లెక్క చేయకుండా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చేసింది. నిర్మాతలు అడిగిందే తడవుగా ఇచ్చిన ఆ అనుమతులతో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఇరుకునపడింది.

పెద్ది సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ అనుమతులు ఇచ్చారు. దీంతో ఇప్పుడు శిఖా గోయల్‌పై హైకోర్టులో (high court) కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో జీవో 151ను అనుసరించకుండా, ఈ నెల 2వ తేదీన పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుకు జీవో జారీ చేసిన శిఖా గోయల్ పై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. దీంతో హైకోర్టు స్పందించింది.

High Court Moves Contempt Petition Against Revanth Reddy Government Over Peddi Ticket Price Hike

తమ ఆంక్షల్ని లెక్కచేయకుండా పెద్ది సినిమా టికెట్ల పెంపుకు అనుమతులు మంజూరు చేసిన శిఖా గోయల్ పై కోర్టు ధిక్కార చర్యల కోసం దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రాథమికంగా టికెట్ ధరల పెంపు జీవో అక్రమమని తేల్చింది. అయితే ఈ వ్యవహారంలో తదుపరి విచారణను మాత్రం ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణలో శిఖా గోయల్ హాజరై ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టుకు వివరణ ఇవ్వనున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత హైకోర్టు నిర్ణయం ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+