భారత్ పై అక్కడినుంచి దెబ్బకొట్టిన పాకిస్థాన్.. ఏడాది నుంచి భారీ కుట్ర వెలుగులోకి..!
భారత్ సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటూనే ఉంది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పాకిస్థాన్ పై భారత్ దౌత్య పరమైన, వాణిజ్య పరమైన ఆంక్షలు విధించింది. ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు నిషేధం, ఇరు దేశాల గగనతలాలు మూసివేత, అలాగే సింధూ నది జలాల ఒప్పందం నిలిపివేత తదితర కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఇక భారత్ ను డైరెక్ట్ గా ఎదుర్కునే సామర్థ్యం లేక ప్రతిదానికి చైనా సాయం కోరుతోంది పాకిస్థాన్. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ చైనా డ్రోన్ లు, సాంకేతికతను వినియోగించుకుంది. ఇలా ప్రతి విషయంలో చైనాపై పాకిస్థాన్ ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అటు అంతరిక్ష పరిశోధనల్లోనూ పాకిస్థాన్ కు చైనా సాయపడుతోంది. పాకిస్థాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ(సుపార్కో) చైనా సాయంతో భారత్ లక్ష్యంగా అంతరిక్షంలో భారీ నిఘా నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా భారత్ సరిహద్దులు, సైనికుల కదలికలను ప్రతి 48 గంటలకు ఓసారి పాకిస్థాన్ పర్యవేక్షిస్తోందని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాకిస్థాన్ 1961 నుంచి 2014 వరకు కేవలం 9 ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించింది. కానీ జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కేవలం 16 నెలల కాలంలోనే ఏకంగా 6 సరికొత్త ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్ష రంగంలో పాకిస్థాన్ దూకుడుని చూసి భారత రక్షణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఉపగ్రహాలు వ్యవసాయం, వాతావరణం, విపత్తు నిర్వహణ తదితర అవసరాల కోసం అని పాకిస్థాన్ వాదిస్తోంది. కానీ అమెరికాకు చెందిన ఓ స్పేస్ అనలిటిక్స్ సంస్థ అందిస్తున్న సమాచారం మేరకు వీటి కక్ష్యల్ని ప్రత్యక్షంగా డిజైన్ చేశారు. వీటి ద్వారా భారత్ సరిహద్దు ప్రాంతాలపై నిఘా, సైనికుల కదలికల్ని గుర్తిస్తున్నట్లు స్పష్టం చేసింది.

పాకిస్థాన్ కు సొంతంగా రాకెట్ లాంచింగ్ సదుపాయం లేదు. ఈ 6 ఉపగ్రహాలలో 5 ఉపగ్రహాలను చైనా తన లాంగ్ మార్చ్ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపింది. అయితే టెక్నాలజీ బదిలీ, శాటిలైట్ డిజైన్, డేటా షేరింగ్ అంతా చైనా పర్యవేక్షణలోనే జరిగింది. చైనాకు చెందిన సొంత నిఘా నెట్ వర్క్, పాకిస్థాన్ శాటిలైట్స్ కలిసి ఉమ్మడిగా భారత్ పై నిరంతర నిఘాను కొనసాగిస్తున్నట్లుగా భారత రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications