హైదరాబాద్‌ః ప్రముఖ నటి విజయశాంతి ఆత్మహత్యా ప్రయత్నం చేశారంటూ వచ్చిన వార్తలతో హైదరాబాద్, చెన్నై నగరాలు సోమవారం నాడు గగ్గోలెత్తిపోయాయి.
పత్రికా కార్యాలయాలకు, మీడియా కేంద్రాలకుపెద్ద సంఖ్యలో ఫోన్‌కాల్స్ వచ్చాయి. విషయం ఎమిటో తెలుసుకునేందుకువిలేకరులు కూడా ఇటు హైదరాబాద్, అటు చెన్నైలో వున్న సినిమా ప్రముఖులను సంప్రదించేందుకు ప్రయత్నాలు జరిపారు. చివరకు ఇవి ఉత్తపుకార్లేనని తేలిపోయింది. ఈ పుకార్లు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించింది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీవిజయశాంతి అభిమానులు, సినిమాప్రియులను మాత్రం ఈ పుకార్లుతీవ్ర ఆందోళనకు, కలవరానికి గురిచేశాయి.