కాశ్మీర్ ఎన్నికలు బూటకం: ముషార్రఫ్
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం నిర్వహించే ఎన్నికలు బూటకమని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్ ధ్వజమెత్తారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటయిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన బుధవారం ఉదయం ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్‌లోప్లెబిసైట్ నిర్వహించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తీవ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్థాన్ కృతనిశ్చయంతో పని చేస్తోందని, పాక్ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయని, వాటిని తీవ్రవాదుల చేతుల్లో పడకుండా రక్షించుకుంటామని ఆయన అన్నారు. సరిహద్దుల నుంచి ఇప్పుడేసైన్యాలను ఉపసహంరిచబోమని, భారత్ దుస్సాహసానికి దిగితే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లోఅక్టోబర్ తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, ఇది దేశంలో కీలకమైన మార్పుకు దోహదం చేస్తుందని, ఈ మార్పు భవిష్యత్తు ప్రజాస్వామ్యానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
