బోర్సాడ్ లో కర్ఫ్యూ కొనసాగింపు
అహ్మదాబాద్‌ః అహ్మదాబాద్ లో మంగళవారం అల్లర్లు చెలరేగిన బోర్సాడ్ పట్టణం ఇంకా ఉద్రిక్తత గుప్పిట్లోనే వుంది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బుధవారం నాడు కూడా కర్ఫ్యూ కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డవిషయం విదితమే.
పరిస్థితి ఉద్రిక్తంగా వున్నప్పటికీ అదుపులోనే వున్నదని ఆయన చెప్పారు. మంగళవారం నాడు అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడంతో పోలీసులు 31రౌండ్లు కాల్పులు జరిపారు. అల్లరి మూకలు రాళ్ళువిసిరిన సంఘటనలో కనీసం 20 మంది పోలీసులు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications
