మాల్దీవుల ఆర్థికాభివృద్ధికి చేయూత
మాలే: మాల్దీవుల అర్థికాభివృద్ధికి భారత్ అన్ని విధాల సహకరిస్తుందని భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హామీ ఇచ్చారు. పర్యాటక, మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక, తదితర రంగాల్లో సహకారం అందిస్తుందని ఆయన చెప్పారు. మాల్దీవుల పర్యటనకు వచ్చిన భారత ప్రధాని ఇక్కడి వార్తా పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ప్రధాని వెంట మాల్దీవులకు వచ్చిన పర్యాటక శాఖ సహాయ మంత్రి వినోద్ ఖన్నా మాల్దీవుల పర్యాటక మంత్రితో చర్చలు జరుపుతున్నారు. ఐలాండ్ టూరిజంలో మాల్దీవులువిశేష ప్రగతి సాధించిందని, ఇది ఇతర దేశాలకు ఆదర్శమని వాజ్‌పేయి అన్నారు. సమాచార సాంకేతిక రంగంలో సంయుక్త భాగస్వామ్యాలకు అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
