పీకలదాకా తాగిన సల్మాన్‌ఖాన్‌

ముంబయ్‌ః ప్రముఖ సినీనటుడు సల్మాన్‌ఖాన్‌ పీకలదాకా మద్యం తాగి కారు నడిపి, ఒకరి మృతికి కారకుడయ్యాడని నిర్ధారణఅయింది. వైద్య పరీక్షల్లో ఆయన మద్యం సేవించినట్లు వెల్లడైందని పోలీసు అధికారులు మంగళవారం వెల్లడించారు. సల్మాన్‌ఖాన్‌ నడుపుతున్న టొయోటా కారు ఒక బేకరీలోకి దూసుకుపోగా ఒకరు మరణించారు. నలుగురు ఆస్పత్రి పాలయ్యారు. కోర్టులో లొంగిన సల్మాన్‌ ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యారు.

పరిమితికి మించి ఆయన మద్యంసేవించినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. అంతకు ముందు సల్మాన్‌ఖాన్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను అసలు మద్యంసేవించలేదని చెప్పుకున్నారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రిరెండు గంటల వరకు సల్మాన్‌ఖాన్‌ మద్యం సేవిస్తునే వున్నాడని అభిజ్ఞవర్గాలు చెప్పాయి.

ఆ తరువాత ఓ మిత్రుడి ఇంట్లో ఆగి మరో రెండు పెగ్గులు తాగాడని కొందరు చెప్పారు.సెప్టెంబర్‌ 28 తెల్లవారుజామున బేకరీలోకి కారును దూకించిన సమయంలో సల్మాన్‌ఖాన్‌ ఒళ్ళు తెలియని స్థితిలో కారు బయటపడి వున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సల్మాన్‌ లాయర్‌ మాత్రం ఈ వాదనలను ఖండించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సల్మాన్‌ అక్కడి నుంచి పారిపోయి 11 గంటలకు పోలీసులకు లొంగిపోయారు. ఆ తరువాత బెయిల్‌ పై విడుదలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+