రిపోర్టర్లపై వాయిలర్ మండిపాటు
న్యూఢిల్లీ: మాయవతి ప్రభుత్వం పతనం అంచున ఉండడంతో..ప్రభుత్వ ఏర్పాటుకు సమాజ్ వాది పార్టీ సమాయత్తమవుతోంది. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతోంది. సమాజ్ వాది పార్టీ నేత అమర్ సింగ్ శనివారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యేందుకు సమయాన్ని కోరారు.
బిజెపిలోని అసంతుష్టులు చీలే అవకాశం ఉండడంతో మాయవతి ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉంది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు తమకే ఛాన్స్ వస్తుందని సమాజ్ వాది పార్టీ భావిస్తోంది. 403 సభ్యుల గల యూపీ అసెంబ్లీలో ఎస్.పి 143 మంది ఎమ్మెల్యేలున్నారు.
కాంగ్రెస్, సిపిఎం, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎస్.పి ప్రయత్నిస్తోంది. మరోవైపు, తమ పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలను బిజెపి మొదలుపెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం అసంతుష్టులను కలిసి వారితో సంప్రదింపులు జరిపారు. వారి మనోగతాన్ని తెలుసుకున్నారు












Click it and Unblock the Notifications
