పొత్తు లేదు, అయితే మద్దతు..: ఏచూరి
హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడుసీతారాం ఏచూరి స్పష్టం చేశారు. అయితే తాము పోటీ చేయని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను బలపరుస్తామని ఆయన శుక్రవారం ఇక్కడవిలేకరుల సమావేశంలో చెప్పారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి తృతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై దీర్ఘకాలిక పోరాటాలకు ముందుకు వచ్చే లౌకిక పార్టీలతో తాము కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. మతతత్వ బిజెపిని నిరోధించడానికి తాము లౌకిక పార్టీలను బలపరుస్తామని కూడా ఆయన చెప్పారు. అయోధ్యవిషయంలో కోర్టు తీర్పునకు అన్ని పక్షాలు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications