Home
Posted on 07-11-03
ముంబాయి: నకిలీ స్టాంపుల కుంభకోణంలో జాయింట్ పోలీసు కమీషనర్ (ఇంటలిజెన్స్) శ్రీధర్ వాఘల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం అరెస్టు చేసింది. వాఘల్‌ను సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేశారు.
అబ్దుల్ కరీం తెల్గీకి వాఘల్ క్రైం బ్రాంచ్ జాయింట్ కమీషనర్‌గా ఉన్నప్పుడు అనుకూలంగా వ్యవహరించారనేది ఆరోపణ. క్రైమ్ బ్రాంచ్ నకిలీ స్టాంపుల కుంభకోణంపై ఆ సమయంలో దర్యాప్తు చేస్తోంది. తెల్గీని ఈ ఏడాది జనవరిలో క్రైమ్ బ్రాంచ్ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కటకటాల వెనక ఉండాల్సిన తెల్గీ ఆ సమయంలో వాఘల్ నివాసంలో కొంత మంది క్రైమ్ బ్రాంచ్ అధికారులతో పాటు కనిపించారు.












Click it and Unblock the Notifications
