Home
Posted on 10-11-03
రాజమండ్రిః తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురం సమీపంలో గోదావరి నదిలో పడవ రెండు పడవలు మునిగిపోయాయి. దీంతో 15 మంది మరణించినట్లు సమాచారం.
సోమవారం సాయంత్రం వరకు 14 మృతదేహాలను వెలికితీశారు. ఇందులో ఎనమండుగురు మహిళలు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రెండు పడవల్లో దాదాపు 50 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు చెప్పారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహాల వెలికితీతకు గజ ఈతగాళ్లను రప్పించారు. మృతులందరూ వ్యవసాయ కూలీలే. మృతుల కుటుంబాల రోదనలతో సంఘటనా స్థలం హృదయ విదారకంగా ఉంది. మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయలేసి ఎక్స్‌గ్రేషియాను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications
