Home
Posted on 10-11-03
న్యూఢిల్లీః ఆరుగురు తమిళనాడు జరలిస్టులపై అరెస్టు వారెంట్లను సుప్రీంకోర్టు సోమవారం ఉదయం నిలిపివేసింది.
సభా హక్కుల ఉల్లంఘన అభియోగంపై గతవారం తమిళనాడు అసెంబ్లీ హిందూ ఎడిటర్ ఎన్ రామ్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మాలినీ పార్ధ సారధి, పబ్లిషర్ రంగరాజన్, చీఫ్ ఆఫ్ బ్యూరో వి.జయంత్, స్పెషల్ కరస్పాండెంట్ రాదా వెంకటేశం (అందరూ హిందూ పత్రిక వారే), డిఎంకె పత్రిక మురసోలి ఎడిటర్ ఎస్ సెల్వంలకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దీనిపై స్టే కోరుతూ వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జయంత్, వెంకటేశన్ లు రాసిన ఆర్టికల్ ఆధారంగా హిందూ ప్రచురించినసంపాదకీయానికి సంబంధించి తమిళనాడు స్పీకరు కాళిముత్తు అరెస్టు వారెంట్లు జారీ చేశారు. ఇదే సంపాదకీయాన్ని పునర్ముద్రించినందుకు మురసోలి పత్రిక ఎడిటర్ సెల్వం కు కూడా అరెస్టు వారెంటు అందింది.












Click it and Unblock the Notifications
