Home
Posted on 19-11-03
కాంగ్రెస్‌కు కొలమట్ల రాజీనామా
విజయనగరం: జిల్లా కాంగ్రెస్ నాయకుడు కొలమట్ల వీరభద్రస్వామి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బుధవారం ఒక బహిరంగ సభలో తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు.
కొలమట్ల గతంలో రెండు సార్లు మంత్రి అశోక్ గజపతిరాజుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆయనతో పాటు పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుల పట్ల అసంతృప్తితోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన రాజీనామా కాంగ్రెస్‌కు విజయనగరం జిల్లాలో పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
