ఏం చేయాలో తెలుసు: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 21-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: ఏం చేయాలో నాకు తెలుసు అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గాంధీ వైద్య కళాశాల విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.పేదలకు సేవ చేయాల్సిన వైద్య విద్యార్థుల్లో క్రమశిక్షణా రాహిత్యం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గాంధీ ఆస్పత్రి, వైద్యకళాశాలల నూతన భవనాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమకు క్రీడల కోసం చోటు కవాలని వైద్య విద్యార్థులు డిమాండ్‌ చేయడంతో చంద్రబాబు చిరాకుపడ్డారు. వైద్యులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని, మొండివైఖరి అవలంభిస్తే వైద్య వృత్తికి మంచిది కాదని ఆయన అన్నారు. సేవాభావంతో పని చేసినప్పుడే వైద్య వృత్తికి సార్థకత అని ఆయన అన్నారు. ఈ భవనాలు పేద ప్రజల కోసం కట్టాను, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చంద్రబాబు అన్నారు.

హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌ కేంద్ర కార్యాలయాన్ని తొలగించి ఆ స్థలంలో గాంధీ ఆస్పత్రి, వైద్య కళాశాలల కోసం 30 ఎకరాల్లో 87 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి