బాంబు పేలి 25 మందికి గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 21-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

ముంబాయి: మహారాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతంలో గల పర్భాని మసీదులోకి దుండగులు బాంబులువిసిరారు. ఈ బాంబు పేలడంతో 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటన మొహమదియా మసీదులో శుక్రవారంనాడు మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో నమాజు చేస్తుండగా జరిగింది.

దుండగులు మోటార్‌ సైకిళ్లపేఐ వచ్చి రెండు నాటు బాంబులను మసీదులోకి విసిరారని ఉప ముఖ్యమంత్రి ఛగన్‌ భుజబల్‌ విలేకరులతో చెప్పారు. ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలో కర్ఫ్యూ విధించారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రమంతటినీ అప్రమత్తం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X