అవినీతిలో బిజెపి రికార్డు: సోనియా

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 21-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

అలోట్‌ (మధ్యప్రదేశ్‌): భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు, మంత్రులు లంచగొండితనంలో, అవినీతిలో రికార్డులు అధిగమిస్తున్నారని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఎఐసిసి) అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. బిజెపిపై ఆమె శుక్రవారం ఎన్నికల ప్రచారసభలో తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఛత్తీస్‌ఘడ్‌ బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి దిలీప్‌సింగ్‌ జుదేవ్‌ పేరెత్తకుండా- ఎన్నికలు లేకపోతే ఆయన రాజీనామా చేసి వుండేవారు కారని సోనియా అన్నారు. డబ్బు బండిల్స్‌ తీసుకుంటున్నట్లు టీవీలో చూపించినప్పటికీ జుదేవ్‌ను అరెస్టు చేసి అతనిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయకపోవడం, సిబిఐ విచారణ చేపట్టకపోవడం ఆశ్చర్యకరం, దిగ్భ్రాంతి కలిగించే విషయమని సోనియా అన్నారు.

నిందితుడు వాజ్‌పేయి మంత్రివర్గంలోని సభ్యుడు అయినందున ప్రభుత్వం, బిజెపి నెట్‌వర్క్‌ జుదేవ్‌ను సమర్థిస్తోదని ఆమె అన్నారు. ఒక సామాన్య పౌరుడో, జూనియర్‌ ప్రభుత్వోద్యోగో ఆ పని చేసి వుంటే ముందు అరెస్టు చేసి క్రిమినల్‌ కేసు పెట్టి వుండేవారని ఆమె అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X