మరో 8 మంది బీహారీల హత్య
Posted on 22-11-03
గౌహతి: అస్సాంలో బీహారీల ఊచకోత కొనసాగుతూనే ఉన్నది. తిన్సుకియా జిల్లాలో శనివారం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్‌ఆస్సాం (ఉల్ఫా తీవ్రవాదులు ఎనిమిది బీహారీలను హత్య చేశారు.
మరణించినవారందరూ కూలీలే. మిలిటెంట్ల దాడిలో మరో ఇద్దరిని గాయపడ్డారు. మహకాళి టీ ఎస్టేట్ వద్ద ఉన్న ఇటుక బట్టీల వద్దకు ఉల్ఫా మిలిటెంట్లు వచ్చి అక్కడ పని చేస్తున్న బీహారీ కార్మికులను కాల్చి చంపినట్లు ఐజిపి (స్పెషల్ బ్రాంచ్) కె. ఎన్. శర్మ విలేకరులకు చెప్పారు. ఈ దాడిలో 15 మంది మరణించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications