గ్రూప్‌లు కడితే టికెట్లు ఇవ్వం: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 22-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: గ్రూప్‌లు కట్టి ఒత్తిడి తెస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నాయకులను హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ఈ హెచ్చరిక చేశారు.

మంచివారికి వద్దన్నా టికెట్లు ఇస్తామని ఆయన చెప్పారు. గ్రూప్‌లు కట్టి ఒత్తిడి తెస్తే ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. పైరవీలు కుదరవని ఆయన తేల్చి చెప్పారు. సేవాభావం, మంచి పేరు ఉన్నవారికి, అవినీతికి దూరంగా ఉండేవారికి తామే ఏరికోరి టికెట్లు ఇస్తామని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపకల్పనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తామని ఆయన చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X