కోవర్ట్‌లను కాల్చిచంపినవార్‌

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 23-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: పీపుల్స్‌ వార్‌లో ఉంటూనే పోలీసులకు సమాచారం అందిస్తున్నారనిఅనుమానిస్తూ వార్‌ బంధించిన కోవర్ట్‌ లనుశిక్షించింది. నగేష్‌ గౌడ్‌ ను కాల్చిచంపింది. నల్గొండజిల్లాలో నగేష్‌ మృతదేహం ఆదివారం లభించింది.ఆయన ఎడమ కంటి వద్ద తుపాకీ పెట్టి కాల్చిచంపారని పోలీసులు తెలిపారు.ఆయన శరీరంపై బాగా చితకబాదినగుర్తులున్నాయన్నారు.

ఆయన షర్ట్‌ జేబులో ఉన్నటెలిఫోన్‌ డైరీని బట్టి నగేష్‌ గౌడ్‌ గా పోలీసులుగుర్తించారు. నగేష్‌ కు సహకరించాడన్నఉద్దేశంతో నిర్భందించిన మరో వ్యక్తి రాంరెడ్డిని కూడావార్‌ శిక్షించింది. ఇబ్రహీంపట్నం పరిసరప్రాంతాల్లో వార్‌ ఆయన మృతదేహాన్ని పడేసివెళ్లగా, ఉదయం పోలీసులు దాన్ని రామిరెడ్డిమృతదేహాంగా గుర్తించారు. వార్‌ సీనియర్‌ నాయకులనుచంపేందుకు పోలీసులను సహకరించేందుకువీరివురూ పోలీసులకు సహకరిస్తూ కోవర్ట్‌ లుగా పనిచేస్తున్నారనివార్‌ పేర్కొంది. కొద్ది రోజుల క్రితమే సిరాజ్‌ను శిక్షించినవార్‌ మరో ఇద్దరు కోవర్ట్‌ లను చంపడం ద్వారా పోలీసులకు సవాల్‌విసిరిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X