వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Home
Posted on 25-11-03
కర్నూలు: తీవ్రవాదులతో, వేర్పాటువాదులతో కాంగ్రెస్ రాజీ పడిపోయిందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడువిమర్శించారు. చదువుల పండుగలో భాగంగా జరిగిన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పలుగూరు గ్రామసభలో ఆయన మంగళవారం ప్రసంగించారు.
కాంగ్రెస్ హామీలు ప్రచారానికే పరిమితమని ఆయన అన్నారు. ప్రతిపక్షాలపై ఆయన తీవ్రవిమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చే ఉచిత వాగ్దానాలు కావాలో, పని చేసే ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలనుకోరారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని ఆయన అన్నారు. తాము ఎనిమిదిన్నర యేళ్ల కాలంలో ఎంతో సాధించామని ఆయన చెప్పారు. గోదావరి జలాలను రాయలసీమకు మళ్లిస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!