బస్సుయాత్ర తర్వాతమేనిఫెస్టోఃగాలి
Posted on 25-11-03
విశాఖపట్నంః ప్రజాహితబస్సు యాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటుచేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు మంగళవారం ఇక్కడ విలేకరులసమావేశంలో చెప్పారు. చిన్న రైతులకు, ఒకేబల్బు వాడే వారికి ఉచిత విద్యుత్ మేనిఫెస్టోలో ప్రధానాంశంగాఉంటుందని ఆయన చెప్పారు.
పాదయాత్ర సందర్భంగా సిఎల్పీనాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చినహామీలను కూడా మేనిఫెస్టోలో చేర్చుతామనిఅన్నారు. వైఎస్, డిఎస్ లకు చంద్రబాబు నాయుడితో చర్చించేటంతస్ధాయిలేదని తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానించడాన్నిముద్దు కృష్ణమ నాయుడు తప్పు పట్టారు.రాజకీయాల్లో వీళ్ళంతా సమకాలికులని ఆయనఅన్నారు.












Click it and Unblock the Notifications
