Home
Posted on 25-11-03
న్యూఢిల్లీ: కామన్ అడ్మిషన్ టెస్టు(క్యాట్) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇండియన్ మేనేజ్‌మెంట్ సంస్థ(ఐఐఎం) ఫ్యాకల్లీ సభ్యుల ప్రమేయం ఉండే అవకాశం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) అభిప్రాయపడింది. ప్రశ్నపత్రాలు అచ్చేసిన ప్రెస్‌లోనే ఏదైనా జరిగి వుంటుందని సిబిఐ భావిస్తోంది.
ప్రింటింగ్ ప్రెస్‌లోనే ఏదో తప్పు జరిగి వుంటుందని, దీన్ని తాము స్క్రూటినైజ్ చేస్తున్నామని సిబిఐ డైరెక్టర్‌పి.సి. శర్మ మంగళవారం విలేకరులతో అన్నారు. స్టాంపుల కుంభకోణందర్యాప్తును సిబిఐకిఅప్పగిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా అనివిలేకరులు అడిగితే సమాచారమేదో కొంత వచ్చిందని జవాబిచ్చారు. అయితే ఆ సమాచారం గురించివివరంగా చెప్పడానికి ఆయన నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు నివేదించిన వెంటనే తాము దర్యాప్తు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
