Home
Posted on 25-11-03
అనంతపురం: ప్రజాహిత బస్సుయాత్రను త్వరలో తెలంగాణలో చేపడుతామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. రాయలసీమలో చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభమైంది. గుంతకల్‌లో రాత్రి ముగుస్తుంది.
మంగళవారం రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ బస్సు యాత్ర జోరుగా సాగింది.పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పెనుకొండలో బస్సు యాత్రకు తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఆటంకం ఎదురైంది. బస్సుయాత్రకు తెలుగుదేశం కార్యకర్తలు అడ్డం తిరిగి కాంగ్రెస్ నాయకులు అబద్ధం ప్రచారం మానుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
