Home

Posted on 25-11-03

ఐడియల్‌లో పేలుడు: 9 మంది మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని మూసాపేటలో గల ప్రైవేట్‌ పేలుడు పదార్థాల కంపెనీ ఐడియల్‌లో భారీవిస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.

డెటొనేటర్స్‌, ఇతర పేలుడు పదార్థాలు తయారు చేసే ఇండియన్‌డెటొనేటర్స్‌ లిమిటెడ్‌ (ఐడియల్‌) కర్మాగారంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించిందని, ఈ సంఘటనలో తొమ్మిది మంది మరణించారని, సహాయక చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు చెప్పారు. పేలుడు ప్రభావానికి భవనం, షెడ్‌ నేటమట్టమయ్యాయి. ఈ ప్రమాదం సంభవించినప్పుడు యూనిట్‌లో 13 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని,విద్రోహ చర్య కారణం కాదని అధికారవర్గాలుఅంటున్నాయి.

సంఘటనా స్థలాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సందర్శించారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలేసిఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సంఘటనపై ఆయన న్యాయవిచారణకు ఆదేశించారు. మంత్రివిజయరామారావు, కాంగ్రెస్‌ నాయకుడు పి. జనార్దన్‌ రెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+