Home
Posted on 25-11-03
హైదరాబాద్: తెలంగాణవాదానికి గ్రామాల్లో ప్రజాదరణ ఉన్నదో లేదో తెలుసుకోవడానికి ఓపెన్ బ్యాలెట్‌కు సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) భారతీయ జనతా పార్టీకి సవాల్‌విసిరింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గ్రామాల్లో ప్రజాదరణ లేదని బిజెపి నాయకులు సోమవారం అన్నారు. ఈ ప్రకటనపై టిఆర్‌ఎస్ నాయకులు నాయని నర్సింహారెడ్డి, తదితరులు మంగళవారంవిలేకరుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన బిజెపి తర్వాత రాజకీయ లబ్ధి కోసం దాన్ని వదిలేసిందని వారన్నారు.












Click it and Unblock the Notifications
