చంద్రబాబు చేతకానితనంఃకెసిఆర్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లోపెట్టుకునే పొత్తులపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సిపిఐ కాంగ్రెస్‌తోనూ, తెలంగాణ రాష్ట్ర సమితితోనూ ఎన్నికల అవగాహనకు వస్తోందని వస్తున్న వార్తలకు ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. నక్సలైట్లతో చర్చలు జరపాలంటున్న ప్రతిపక్షాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను నక్సలైట్ల సరసన నిలబెడుతున్నారని, ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నదేనని ఆయన అన్నారు. గతంలో ఎన్నికల సమయంలో నక్సలైట్లే దేశభక్తలని తెలుగుదేశం పార్టీ అభివర్ణించిందని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయనే చంద్రబాబువిమర్శను ప్రస్తావిస్తూ దేవాదుల ప్రాజెక్టుకు ఎవరు అడ్డం పడ్డారని ఆయన అడిగారు. నక్సలైట్లకు తెలుగుదేశం నాయకులు సహకరిస్తున్నారనే వార్తలకువివరణ ఇవ్వాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!