25న మైసూరా టిడిపిలో చేరిక
హైదరాబాద్: వచ్చే 8వ తేదీన జరిగే తెలంగాణ మహిళా శంఖారావానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల పొత్తు కుదిరితే సోనియాను ఆహ్వానిస్తామని ఆయన మంగళవారంవిలేకరులతో చెప్పారు.
మహిళా శంఖారావానికి బీహార్ ముఖ్యమంత్రి రబ్రీదేవిని, ఢిల్లీ ముఖ్యమంత్రిషీలాదీక్షిత్‌ను కూడా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో మంత్రుల ప్రాతినిధ్యం వహిస్తున్నసీట్లన్నింటిలో తాము పోటీ చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌తో తమ ఎన్నికల పొత్తు బుధవారంనాటికి ఖరారవుతుందని ఆయన అన్నారు. తన ప్రచారాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక సీటును కూడా గెల్చుకోలేదని, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తు కుదిరితే కాంగ్రెస్, టిఆర్‌ఎస్ కలిసి ప్రచార కార్యక్రమాన్నిచేపడుతాయని ఆయన చెప్పారు. కెసిఆర్ మంగళవారం తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను అభినందించారు. ఆయనకు పూలమాలలు వేశారు. కొందరైతే ఏకంగా పాదాభివందానాలే చేశారు.












Click it and Unblock the Notifications