25న మైసూరా టిడిపిలో చేరిక
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి స్థానికేతరులకు పార్టీ టికెట్లు ఇవ్వకూడదని తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ (టిసిసిసి) కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణలోని నియోజకవర్గాల్లో పోటీకి రాయలసీమ, ఆంధ్ర నాయకులకు టికెట్లు ఇస్తే ఊరుకోబోమని టిసిసిసి నాయకులు జి. చిన్నారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు మంగళవారంవిలేకరుల సమావేశంలో అన్నారు. ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేస్తామని వారు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆందోళన సాగుతున్న సమమయంలో, తెలంగాణసెంటిమెంట్ బలంగా పని చేస్తున్న తరుణంలో స్థానికేతరులకు టికెట్లు ఇవ్వడం సరి కాదని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచి మంత్రులైన స్థానికేతరులు మండవ వెంటకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు వంటివారి వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని వారన్నారు.
గోదావరి నదిపై తలపెట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని వారన్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ప్రయోజనం కలిగేలా ఆ ప్రాజెక్టును చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications