హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిపచ్చి అవకాశవాదంతో వ్యహరి స్తోందని బిజెపి శనివారం విమర్శించింది.కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అందులో చేరడానికి వీరు వెనుకాడరనిబిజెపి అధికార ప్రతినిధి ప్రొఫెసర్ శేషగిరిరావుఅన్నారు.
నరేంద్ర ఇద్దరు నాయకులు రెండు స్థానాల్లో ఎందుకు పోటీచేయాల్సి వస్తున్నదో ప్రజలకు వివరించాలని బిజెపి అధికార ప్రతినిధిప్రొఫెసర్ శేషగిరిరావు శనివారం విలేకరుల సమావేశంలో డిమాండ్‌చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు చిత్తశుద్ధితోకషిచేయకుండా కేవలం అధికార వ్యామోహం, స్వార్థచింతనతో వారువ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇద్దరూ రెండు చోట్ల నుంచి పోటీచేయడం చూస్తుంటే వారిద్దరి మధ్య విబేధాలైనా వచ్చి ఉండాలని, లేనిపక్షంలో ఏ పార్టీలో అధికారంలోకి వస్తే అందులో దూకడానికి గోడమీదపిల్లిలా సిద్ధంగా ఉండాలన్న వ్యూహం తప్ప మరేమి కాదనిపేర్కొన్నారు.