ఎస్‌సిరిజర్వేషన్ల వర్గీకరణ చెల్లదు:
న్యూఢిల్లీ:షెడ్యూల్ కులాల (యస్.సి.) రిజర్వేషన్లవర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పుఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో యస్.సి.రిజర్వేషన్లను వర్గీకరిస్తూ గతతెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేసిన విషయం తెలిసిందే.
రాజ్యాంగంప్రకారం యస్.సి. ల రిజర్వేషన్లవర్గీకరణ చెల్లదని ఐదుగురున్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టుబెంచ్ తీర్పు చెప్పింది. ఈ వర్గీకరణకింద ఇప్పటి వరకు జరిగిననియామకాలు కూడా చెల్లవని కోర్టుప్రకటించింది. ఈ తీర్పుపై ఇప్పుడేతానేమీ వ్యాఖ్యానించలేననిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డిహైదరాబాద్‌లో అన్నారు. కోర్టు తీర్పుపూర్తి పాఠం చదివితే తప్ప తాను ఏమీమాట్లాడలేనని ఆయన శుక్రవారంవిలేకరులతో అన్నారు.
యస్.సి.రిజర్వేషన్లను వర్గీకరించాలంటూతెలుగుదేశం ప్రభుత్వ హయాంలోమాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెద్దయెత్తున ఆందోళన చేపట్టింది. ఈఉద్యమానికి తలవొగ్గి గత ప్రభుత్వంనాలుగు కెటగిరీలుగా విభజించింది. ఈవర్గీకరణను మొదటి మాలమహానాడు వ్యతిరేకిస్తూ వస్తోంది.ఎస్‌సిల రిజర్వేషన్ల వల్ల మాలలేఎక్కువగా లబ్ధి పొందుతున్నారనిరాష్ట్రంలో మాదిగలు పెద్ద యెత్తునఉద్యమం లేవదీశారు. మాదిగరిజర్వేషన్ పోరాట సమితికి మందకృష్ణమాదిగ నాయకత్వంవహించారు. ఈ ఉద్యమానికి రాష్ట్రంలోనిపలువురు మేధావుల మద్దతులభించింది.












Click it and Unblock the Notifications
