హైదరాబాద్ కు దగ్గరలో అద్దిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. వీకెండ్ లో వెళ్తే ఫుల్ చిల్
హైదరాబాద్ నగరంలో జాబ్ చేస్తున్నవారు ఎక్కువగా వెయిట్ చేసేది వీకెండ్ కోసమే. అలాంటి వారు వీకెండ్ లో ఇలా వెళ్లి అలా వచ్చే విధంగా నగరానికి దగ్గరలోనే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్ని ఎంచక్కా చుట్టేయొచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో వెళ్లి చిల్ అవ్వడానికి హైదరాబాద్ కు దగ్గరలోనే బెస్ట్ టూరిస్టు స్పాట్స్ ఉన్నాయని మీకు తెలుసా..? అలా వీకెండ్ లో సరదాగా కారులో వెళ్లి ఫుల్ హ్యాపీ మూడ్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ వీకెండ్ ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. హైదరాబాద్ కు దగ్గరలోనే అనంతగిరి హిల్స్, భువనగిరి కోట, పోచారం డ్యామ్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రాచకొండ కోట, మల్లెల తీర్థం ఇలా అనేక ప్రాంతాలు పర్యటకుల్ని కనువిందు చేస్తుంటాయి.
అనంతగిరి హిల్స్ కు హైదరాబాద్ వాసులు నిత్యం క్యూ కడుతుంటారు. వారమంతా పని చేసి ఆ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఎక్కువగా అనంతగిరి హిల్స్ నే సందర్శిస్తుంటారు. అనంతగిరి హిల్స్ లో ప్రకృతి అందాలను చూడటం, ట్రెక్కింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. హైదరాబాద్ కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అనంతగిరికి వెళ్తే సహజసిద్ధ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అందమైన లోకేషన్స్ తో పాటు పాటు ట్రెక్కింగ్, సైక్లింగ్, రొమాంటిక్ లేదా అడ్వెంచర్ సీన్స్ కు అనంతగిరి కొండలు ప్రాంతం అనుకూలంగా ఉంటుంది.
ఇక భువనగిరి కోట గురించి తెలుసా..? ఈ కోటకు ఎంతో చరిత్ర ఉంది. అప్పటి కాలంలో శత్రువుల నుంచి రక్షణ పొందేందుకు బలీయమైన రాతితో సున్నితమైన బురుజుల శ్రేణులతో భువనగిరి కోటను నిర్మించారు. కోటపై చిన్న చిన్న గూళ్లు, శిల్పాలు, పుష్పగుచ్చాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చారిత్రక కోట హైదరాబాద్ కు దగ్గరలోని భువనగిరిలో ఉంది. అలాగే వీకెండ్ ను ప్రకృతి మధ్య గడపాలని అనుకునేవారికి మల్లెల తీర్థం మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం రెయినీ సీజన్ లో మరింత ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాద్ కు సుమారు 165 కిలోమీటర్ల దూరంలో ఈ మల్లెల తీర్థం జలపాతం ఉంది.

పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ.. తెలంగాణలోని మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉంది. పర్యటకులు, ప్రకృతి ప్రేమికులకు ఇది బెస్ట్ వీకెండ్ టూరిస్ట్ స్పాట్ గా నిలుస్తోంది. ఇక్కడి వన్యప్రాణులు, పక్షులు, 4.5 కిలోమీటర్ల జంగిల్ ట్రెక్కింగ్, నిజాం కాలంనాటి గెస్ట్ హౌజ్, వన విజ్ఞాన కేంద్రం తదితర ప్రాంతాలు పర్యాటకుల్ని అబ్బురపరుస్తుంటాయి.












Click it and Unblock the Notifications
