చర్చలపైమధ్యవర్తులతో సంప్రదింపులు: జానా
హైదరాబాద్:మధ్యవర్తులతో మాట్లాడినతర్వాత నక్సలైట్లతో రెండో దశచర్చలపై నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి కె. జానారెడ్డి చెప్పారు. తాజాపరిస్థితిని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డిగురువారం పోలీసు ఉన్నతాధికారులసమావేశంలో సమీక్షించారు.సమావేశానంతరం జానారెడ్డివిలేకరులతో మాట్లాడారు.
భూముల్లోజెండాలు పాతడం, తదితరనక్సలైట్ల చర్యల నేపథ్యంతోమధ్యవర్తులతో మాట్లాడాలనిఅనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.చర్చల పద్ధతి ఎలా ఉండాలనేదిమంత్రివర్గంలో చర్చించాల్సి ఉందని ఆయనచెప్పారు. చర్చలపై పునరాలోచనచేస్తారా అని విలేకరులు అడిగితేపునరాలోచన ఏమీ కాదని,ఎప్పటికప్పుడు మంత్రివర్గంచర్చిస్తూనే ఉంటుందని ఆయనసమాధానమిచ్చారు.











Click it and Unblock the Notifications
