సిఎంను కలిసినపీఠాధిపతులు
హైదరాబాద్: కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్టుకునిరసనగా జరిగిన ప్రదర్శనలకు నాయకత్వం వహించినఐదుగురుపీఠాధిపతులు శనివారం ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డినికలుసుకున్నారు. స్వామీజీ అరెస్టుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకరించడం సమంజసం కాదనివారు సిఎంకుఫిర్యాదు చేశారు. అరెస్టు విషయంలోప్రభుత్వం రాజ్యాంగబద్ధంగావ్యవహరించిందని ముఖ్యమంత్రి వారికి చెప్పారు.
ఈ అరెస్టుతో తమప్రభుత్వానికి సంబంధం లేదని, కేసుతమిళనాడులో రిజిస్టరయిందని,తమిళనాడు పోలీసులే వచ్చి అరెస్టు చేశారని ఆయన వివరించారు. ఒకఅగ్రశ్రేణి హిందూ స్వామీజీని సామాన్యఖైదీలా చూడడం సమంజసం కాదనిపీఠాధిపతులు ముఖ్యమంత్రికి చెప్పారు.ఈ విషయంలో తాను తమిళనాడుప్రభుత్వంతో మాట్లాడడం కుదరదని, క్రేంద ప్రభుత్వంతోమాట్లాడి స్వామీజికి తగిన గౌరవంలభించేలా చూస్తానని సిఎం హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి హామీతో సంతృప్తి చెందనిపీఠాధిపతులు తమ నిరసనకొనసాగిస్తామని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.












Click it and Unblock the Notifications