లియోనెల్ మెస్సీ వీరవిహారం: హ్యాట్రిక్- ఏజ్ జస్ట్ నంబర్.. !!

ఫిఫా వరల్డ్ కప్ లో అద్భుతం సంభవించింది. అర్జెంటీనా కేప్టెన్ లియోనెల్ మెస్సి చరిత్ర తిరగరాశాడు. కాన్సాస్ సిటీ వేదికగా జరిగిన మ్యాచ్ లో తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడీ సాకర్ సూపర్ స్టార్. ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ జేలో భాగంగా అల్జీరియాతో తలపడ్డ మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించాడు. మ్యాచ్ మొత్తం మీద మూడు గోల్స్ నమోదు కాగా.. ఆ మూడు కూడా మెస్సి సాధించినవే. అటు అర్జెంటీనాలో గానీ, ఇటు అల్జీరియాలో గానీ మరో గోల్ చేసిన మొనగాడు మరొకరు లేడు. 38 సంవత్సరాల మెస్సీ గ్రౌండ్ లో పాదరసంలా కదిలాడు. ఏజ్ జస్ట్ నంబర్ అని నిరూపించాడు.

మెస్సీకి ఇది 200 మ్యాచ్. పైగా అంతర్జాతీయ కెరీర్‌లో హ్యాట్రిక్ కొట్టడం కూడా ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా నిలిచిపోయినట్టయింది. తన మాయాజాలంతో అర్జెంటీనాను 3-0 తేడాతో ఘనవిజయ తీరాలకు చేర్చాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా పటిష్టమైన 4-4-2 ఫార్మేషన్‌తో మ్యాచ్ ఆరంభం నుంచే పూర్తి నియంత్రణ సాధించింది. ఆట మొదటి సగంలో మెస్సీ తన మొదటి గోల్ చేసి అర్జెంటీనాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

Lionel Messi Completes His First FIFA World Cup Hat-Trick vs Algeria Cool finish in the 76th minute

అనంతరం ఆట 60వ నిమిషంలో అలెక్సిస్ మెక్ అలిస్టర్ కొట్టిన షాట్ ను అల్జీరియా గోల్‌కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. దీంతో బంతి రీబౌండ్‌ అయింది. ఎంత వేగంగా వెనక్కి వచ్చిందో.. దాన్ని అంతే వేగంతో మెస్సీ గోల్‌గా మలిచాడు. గోల్ కీపర్ అడ్డుకోవడం ద్వారా రీబౌండ్ అయిన బంతిని తిరిగి గోల్ లోపలికి పంపించడం అంటే.. దాదాపు అసాధ్యం. దీన్ని సాధ్యం చేసి చూపించాడు మెస్సీ. దీంతో అర్జెంటీనా స్కోర్ 2-0 పెరిగింది.

ఆ తర్వాత 76వ నిమిషంలో మెస్సీ మరో మేజిక్ చేశాడు. గ్రౌండ్ మధ్యభాగం నుంచి అద్భుతంగా డ్రిబ్లింగ్ చేస్తూ బంతిని లెఫ్ వింగర్ నికో గొంజాలెజ్‌కు పాస్ చేశాడు. గోల్ పోస్ట్ కు సమీపించినప్పుడు గొంజాలెజ్ తిరిగి దీన్ని పాస్‌కి పాస్ చేశాడు. బంతిని అందుకున్న మెస్సీ.. ఓ కర్లింగ్ షాట్‌తో దాన్ని గోల్ పోస్ట్ లోయర్ కార్నర్‌కు నెట్టి తన హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. ఈ అద్భుతమైన గోల్‌తో స్టేడియం అంతా ఒక్కసారిగా మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది.

ఈ మ్యాచ్ ద్వారా మెస్సీ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2006లో జూన్ 16వ తేదీన సెర్బియా అండ్ మోంటెనెగ్రోపై తన మొట్టమొదటి ప్రపంచకప్ గోల్ సాధించిన మెస్సీ.. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత అదే జూన్ లో 17వ తేదీన ఈ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. దీంతో ప్రపంచకప్‌లో తొలి గోల్, తాజా గోల్ మధ్య అత్యంత సుదీర్ఘమైన వ్యవధి కలిగిన ఆటగాడిగా మెస్సీ చరిత్ర సృష్టించాడు.

పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తర్వాత అయిదు ప్రపంచకప్ ఎడిషన్లలో గోల్స్ సాధించిన రెండో ఆటగాడిగా కూడా మెస్సీ రికార్డు నమోదు చేశాడు. దీంతో ఫిఫా వరల్డ్ కప్ లో సుదీర్ఘ వ్యవధి కలిగిన ప్లేయర్లల్లో అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తంగా మెస్సీ- 20 సంవత్సరాలు, క్రిస్టియానో రొనాల్డో- 16 సంవత్సరాల 164 రోజులు, మిరోస్లావ్ క్లోస్- 12 సంవత్సరాల 40 రోజులు.

మ్యాచ్ ప్రారంభంలో అల్జీరియా జట్టు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అల్జీరియా ఆటగాడు ఫారెస్ చైబీ కొట్టిన గోల్‌ వీఏఆర్ రివ్యూ ద్వారా రద్దు కావడంతో ఆ జట్టు డీలా పడింది. మొదట్లో మెస్సీ కొట్టిన ఒక షాట్ కూడా ఆఫ్ సైడ్‌గా తేలింది. అయినప్పటికీ, ఎమిలియానో మార్టినెజ్ నేతృత్వంలోని అర్జెంటీనా డిఫెన్స్ ప్రత్యర్థి దాడిని సమర్థంగా అడ్డుకుని క్లీన్ షీట్‌ను కాపాడుకుంది. ఈ అద్భుతమైన విజయంతో అర్జెంటీనా తన టైటిల్ నిలబెట్టుకునే పోరాటాన్ని అత్యంత ఘనంగా ప్రారంభించినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+