సూపర్ టేస్టీ 'క్యాలీఫ్లవర్ ఫ్రై'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ డబుల్..!
పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయల్లో క్యాలీఫ్లవర్ ఒకటని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఈ కాయగూరను అందరూ తినేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు క్యాలీఫ్లవర్ ను తినేందుకు ఇష్టపడరు. అయితే.. ఓసారి ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టండి. టేస్ట్ సూపర్ గా ఉండి తినేకొద్దీ తినాలనిపిస్తుంది. ఈ టేస్టీ కర్రీకి ప్రిపరేషన్ కూడా వెరీ ఈజీ. మరి 'క్యాలీఫ్లవర్ ఫ్రై'ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
క్యాలీఫ్లవర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే క్యాలీఫ్లవర్ 250 గ్రాములు, ఉల్లిపాయ ఒకటి మీడియం, పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు, వెల్లుల్లి రెబ్బలు ఐదు లేదా ఆరు, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర అర టేబుల్ స్పూన్, కారంపొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఫ్రై తయారీ విధానం చూస్తే..

ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కలను చిన్నగా కట్ చేసి ఉప్పు నీటిలో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికిన క్యాలీఫ్లవర్ ను నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాను సిద్దం చేసుకోవాలి. అందుకోసం జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించిన క్యాలీఫ్లవర్ ను కలిపి ఐదు నిమిషాల పాటు అలాగే వేయించుకోవాలి. ఇప్పుడు సిద్ధంగా ఉన్న మసాలా వేసి ఐదు నిమిషాలు వేయించి సర్వ్ చేసుకోవడమే.. అంతే సూపర్ టేస్టీ క్యాలీఫ్లవర్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications