కంచి పీఠానికిచుట్టుకుంటున్న మరో హత్య
హైదరాబాద్:కంచి కామకోటి పీఠానికి మరో హత్యకేసు చుట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనిగుంటూరుకు చెందిన విద్యార్థి మరణంవెనక కూడా కంచి పీఠం హస్తం ఉండిఉంటుందనే అనుమానాలువ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17వతేదీన కొలనులో మరణించినదేశరాజు అయ్యప్పశర్మది హత్యే అయివుండవచ్చునని అతని తల్లిదండ్రులుఆరోపిస్తున్నారు. అయ్యప్పశర్మ తండ్రిమరుత్ కుమార్ ఇంటర్వ్యూనుప్రసారం చేసిన ఒక తెలుగు ప్రైవేట్‌టీవీ ఛానల్ దానికి సంబంధించినవివరాలను వెల్లడించింది.
తమకుమారుడి మరణంపై పూర్తి స్థాయిదర్యాప్తు జరగాలని మరుత్ కుమార్‌ఆ ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఇచ్చినఇంటర్వ్యూలో అన్నారు. శృంగేరిపీఠంపరీక్షలో ఉత్తీర్ణుడైన తమకుమారుడు అత్యంతప్రతిభావంతుడని, చెన్నైలో ఎం. ఎ.సంస్కృతం చదువుతున్న కాలంలోకొలనులో మరణించాడని ఆయనచెప్పారు. తమ కుమారుడు కొలనులోపడి చనిపోయాడని తమకుపద్దెనిమిదవ తేదీన సమాచారంఅందిందని ఆయన చెప్పారు. మరోఇద్దరితో కలిసి తమ కుమారుడుకొలను సంధ్యావందనానికి వెళ్లాడని,మిగతా ఇద్దరు తిరిగి వచ్చినా తమకుమారుడు తిరిగి రాకపోవడమేఅనుమానానికి తావు ఇస్తోందని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications
