చర్చలకునక్సల్స్‌ ఎప్పుడైనా రావచ్చు: వైయస్‌

హైదరాబాద్‌:నక్సల్స్‌ ప్రభుత్వంతో రెండో విడతచర్చలకు ఎప్పుడైనా రావచ్చుననిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. గవర్నర్‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేతీర్మానంపై జరిగిన చర్చకు ఆయనమంగళవారం సమాధానమిచ్చారు.మూడున్నర గంటల సేపు ఆయనశాసనసభలో మాట్లాడారు.తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ నాయకుడుచంద్రబాబు నాయుడిపై ఆయనవిమర్శనాస్త్రాలు సంధిస్తూ తనప్రసంగాన్ని కొనసాగించారు.

నక్సలైట్లుతమ పంథా వీడాలని, గ్రామాల్లో శాంతినెలకొల్పడానికే శాంతి చర్చలకు శ్రీకారంచుట్టామని ఆయన చెప్పారు.ప్రజాసమస్యలు, వ్యక్తిగత సమస్యలుతీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామనిఆయన చెప్పారు. ఇన్‌ఫార్మర్‌ పేరుతోఒకరిని చంపడానికి నక్సలైట్లకుఅధికారం లేదని, అలాగే ఎన్‌కౌంటర్లపేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు జరిపేఅధికారం పోలీసులకు లేదని ఆయనచెప్పారు. అయితే ఆయుధాలతో ఎవరూతిరగడానికి అధికారం లేదని ఆయనచెప్పారు. ఎన్ని పర్యాయాలైనా తామునక్సల్స్‌తో చర్చలు జరపడానికిసిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.ఆయుధాలు ధరించి నక్సల్స్‌, వారి పేరుచెప్పి వేరేవారు బలవంతపువసూళ్లకు పాల్పడే స్థితినిఅనుమతించడం సరి కాదని ఆయనఅన్నారు.

శాసనసభద్వారా నక్సల్స్‌ను చర్చలకుఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసంగ్రామాల్లో పోలీసుల సంచారం తప్పదనిఆయన స్పష్టం చేశారు. తీవ్రవాదసమస్యను చర్చల ద్వారాపరిష్కరించడానికి తాము తీవ్రంగా కృషిచేస్తున్నామని, ఈ విషయం గవర్నర్‌ప్రసంగంలో స్పష్టంగా ఉన్నదని ఆయనచెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+