రాష్ట్రానికికొత్తగా ఆరు రైళ్ళు
న్యూఢిల్లీ: రైల్వేశాఖమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ శనివారంలోక్‌సభలో ప్రవేశపెట్టిన-2005 రైల్వేబడ్జెట్‌లో రాష్ట్రానికి ఏడు కొత్త రైళ్లు దక్కాయి. మరోఆరు రైళ్లు ప్రయాణించే దూరాన్ని పొడిగిచారు.బల్హార్ష-కాజీపేట, కాజీపేట-విజయవాడ-గూడూరుమార్గంలో ప్రస్తుతం ఉన్న రెండులైన్లకు సమాంతరంగా మరోలైను నిర్మాణంకోసం సర్వే చేయాలని నిర్ణయించారు. రెండుకొత్త మార్గాల నిర్మాణానికి సర్వే చేయబోతున్నారు.దేశం వ్యాప్తంగా 48 కొత్త రైళ్లను ప్రవేశపెట్టగావాటిలో ఏడు మన రాష్ట్రానికి చెందినవే. వీటిలోనాలుగు ఎక్స్‌ప్రెస్‌రైళ్లు కాగా మిగిలినవి పాసింజర్ రైళ్లు.ఏన్నో ఏళ్లుగా నెల్లూరు జిల్లా గూడూరువాసులు కోరుతున్న సింహపురి ఎక్స్‌ప్రెస్‌కు ఈబడ్జెట్‌లో పచ్చజెండా ఊపారు. కొత్తరైళ్లన్నీ సికింద్రాబాద్ నుంచి బయలుదేరేవి కావడం... అందులోమూడు తెలంగాణ ప్రాంతానికే కావడంవిశేషం. కొత్త రైళ్ల వివరాలు... పాసింజర్‌రైళ్లు... సికింద్రాబాద్-బోధన్, సికింద్రాబాద్-బాసర,సికింద్రాబాద్-నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్‌రైళ్లు...సికింద్రాబాద్-చెన్నై (ఎగ్మూర్), తిరుపతి-బిలాస్‌పూర్‌వయా విశాఖపట్టణం, సికింద్రాబాద్-నాందేడ్‌ఎక్స్‌ప్రెస్‌లు మూడు అంతర్ రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌లతోపాటుసికింద్రాబాద్-గూడూరు ఎక్స్‌ప్రెస్‌లుప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications