సింహపురిఎక్స్‌ప్రెస్‌పై పనబాక హర్షం
హైదరాబాద్:రైల్వే బడ్జెట్‌లో గూడూరు-సికింద్రాబాద్‌మధ్య సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెడుతున్నట్టుప్రకటించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రిలాలు ప్రసాద్ యాదవ్‌కు కేంద్ర ఆరోగ్య,సంక్షేమ శాఖ మంత్రి పనబాక లక్ష్ష్మి నెల్లూరు జిల్లా ప్రజల తరఫునశనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలుతెలిపారు. 2005-06 సంవత్సరానికి లాలు ప్రవేశపెట్టినరైల్వే బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు.గత ఏడాది సెప్టెంబరు 17న గూడూరు వచ్చినలాలును ఈ రైలు గురించి కోరడంతోపాటు సింహపురిఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాల్సిందిగాపనబాక లక్ష్మి సూచించగా ఆయన అంగీకరించారు.కోస్తా తీరంలోని నెల్లూరు, బిట్రగుంట, కావలి, శింగరాయకొండ,ఒంగోలు, చీరాల, బాపట్ల ప్రాంతాల ప్రయాణికులకుఈ ఓవర్ నైట్ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందనిఆమె పేర్కొన్నారు. చార్జీలు పెంచకుండా రాష్ట్రానికినాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మూడు ప్యాసింజర్‌రైళ్లు ప్రకటించడం పట్ల కూడా మంత్రిహదయ పూర్వక కతజ్ఞతలుతెలిపారు.












Click it and Unblock the Notifications